What’s Trending

A Song on Mayukha!

Lyrics: Dr. Suddala Ashok Teja
Music: Dr. Yasho Krishna
Singers: Sai Charan, Revathi, Mohiniraj, Padma
Concept: Gopi Sirineni
Production: Sirineni Productions (P) Ltd.

పల్లవి:
=====
పలుకులమ్మ వీణయే మా కడుపు పంటైతే
మా మయూఖ, మా మయూఖ
పార్వతి సిరిమువ్వయే మా గడపలో పడితే
మా మయూఖ, మా మయూఖ
కరిగి పొరలే కరుణయే
మా కూతురై పుడితే
మా మయూఖ, మా మయూఖ
శతాయుష్మాన్ భవ మయూఖ
శతమానం భవతి మయూఖ

చరణం
========
పాల కొలనులో పూచిన
నీలి కలువల కనులతో
పెదవి పలికే పదములను
అనువదించే నటి నయన

జాలి గుణమూ
మొండి తనమూ
జాలి గుణమూ
మొండి తనమూ
కలసి వెరసిన మానవీయత
లేమితో….ఎమీ లేని
సాటి పిల్లల పైన మమత
మా మయూఖ, మా మయూఖ

చరణం
========
ఉంగా ఉంగా నాడే కోయిల
సంగతులతో మురిసెను
హోయలు కులికే చిగురుటాకుల
లయలతో జత కలిపెను

పియానో ఎద ప్రియంవదగా
సాక్సా ఫొన్ స్వర సాక్షిగా
పాటలు కూచిపూడి
ఆటలు మా స్వయంభువులని
వేకువలను స్వాగతించే
లోక ప్రియ మా భారతీయత

విష్వభాషలలోన తెలుగే
లెస్సని ఎద విశ్వసించే
మా మయూఖ, మా మయూఖ
మా మయూఖ, మా మయూఖ

చరణం
========
మహాగణపతి దీవెనే
మహదానందపు నర్తనై
గోపబాలుని చలవ కన్నుల
చూపుచాలనె నాట్యమై

శివునిపాదం- ధూలికణమై
శివునిపాదం- ధూలికణమై
పరవశించే- లాస్యమై
ఓం నమః శివాయా

ఉల్లమే- తల్లీనమై
ఘల్లుమనే తిల్లానై
సాగిపోమ్మ…మా మయూఖ
మా ఆయువు దీప్తివై
మానవతను మేలుకొలిపే
మాతౄభారతి సూక్తివై